కందనవోలు అమరావతి

తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ను కర్నూలు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సిట్ర సత్యనారాయణమ్మ, వైఎస్సార్ పార్టీ ఆంధ్రప్రదేశ్ మదాసి మదారి కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు నాయకులు తెలిపారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో ప్రజలకు మరింత చేరువ కావాలని, పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లాలని జగన్ సూచించినట్లు సమాచారం.
కర్నూలు జిల్లాలో పార్టీ శ్రేణులు మరింత ఐక్యంగా పనిచేసి వైఎస్సార్‌సీపీని ప్రజల్లో బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని సిట్ర సత్యనారాయణమ్మ, గడ్డం రామకృష్ణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక వర్గాల సమన్వయంతో పార్టీకి మరింత బలం చేకూర్చే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఈ భేటీ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జగన్‌కు తమ పూర్తి మద్దతు ప్రకటించారు.

You missed