కందనవోలు పులివెందుల

వైఎస్సార్‌సీపీ నేతలు తమపై చేస్తున్న ఆరోపణలను పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్రంగా ఖండించారు.మున్సిపల్ పరిధిలోని పులివెందుల టీడీపి కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపి ఇన్‌చార్జ్ బీటెక్ రవి కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఘాటు వాక్యాలు చేశారు. గత రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, అమరావతి అంశం, అలాగే పలు ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.విజయసాయిరెడ్డిని కలిసిన విషయంపై ఇప్పుడు మాట్లాడుతున్నారని, అయితే ఆరు సంవత్సరాల పాటు ఎందుకు మౌనం పాటించారని ప్రశ్నించారు. 2014 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కసనూరు ఎంపీటీసీ స్థానాన్ని ఏకగ్రీవంగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, అది ఏ లాలూచీకి జరిగిందో ప్రజలకు చెప్పాలన్నారు.తనకు డబ్బుపై వ్యామోహం లేదని, డబ్బు కోసం రాజకీయాలు చేసే వ్యక్తి తాను కాదని బీటెక్ రవి స్పష్టం చేశారు. అమరావతి తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా ఉంటే 15 కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేసినది మీరే కాదా అని అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. “బీటెక్ రవిని కొనడం మీ వల్ల కాదు, మీ అన్న వల్ల కూడా కాదు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.తనకు మరియు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి బ్లాంక్ చెక్ ఆఫర్ చేసిన విషయం నిజం కాదా అని నిలదీశారు. సీబీఐ విచారణ ఉపసంహరణ కోసం ప్రయత్నాలు జరిగాయంటూ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వివిధ క్యాంప్‌లలో ఉన్న అసంతృప్తుల వివరాలను అందించినది మీరేనని ఆరోపించారు.దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తరువాత BBM సంస్థకు వచ్చిన పనులను రద్దు చేసి కోట్ల రూపాయల కమిషన్లు తీసుకున్నారని విమర్శించారు. అరటి రైతుల కష్టాలను ఉపయోగించుకుని కమిషన్లు తీసుకున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.అలాగే సీఐ రాజేశ్వర్ రెడ్డి, గుణకణపల్లి కృష్ణారెడ్డి లను అడిగితే ఎర్రచందనం అక్రమాల గురించి నిజాలు బయటపడతాయని పేర్కొన్నారు. “మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉలిమెళ్ల తోట ఘటనపై కూడా స్పందిస్తూ, అక్కడ ఏం జరగలేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.“ఇప్పటివరకు పుష్ప-1 మాత్రమే చూపించాం… అవసరమైతే పుష్ప-2, పుష్ప-3 కూడా చూపిస్తాం” అంటూ హెచ్చరికలు జారీ చేశారు. తాను కాదు, బీజేపీలోకి వెళ్లాలని ప్రయత్నించింది వైయస్ అవినాష్ రెడ్డేనని బీటెక్ రవి ఆరోపించారు.

You missed