కందనవోలు కర్నూలు

విశ్వబ్రాహ్మణ సోదరులు, సోదరీమణులు ప్రతిరోజూ పనుల నిమిత్తం టూ వీలర్లు, ఆటోలు తదితర వాహనాలపై గ్రామాలు, పట్టణాల నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అనుకోని రోడ్డు ప్రమాదాలు జరిగితే భయపడాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ కమ్మరి పార్వతమ్మ తెలిపారు.
రోడ్డు ప్రమాద బాధితులకు మాత్రమే నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహితంగా రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే “పీఎం-రహత్ (PM-RAHAT)” పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రమాదం జరిగిన తేదీ నుంచి ఏడు రోజుల వరకు ఈ ఉచిత చికిత్స వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ పథకం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రోడ్డు ప్రమాద బాధితులకు వర్తిస్తుందని తెలిపారు.
అనుకోని ప్రమాదం జరిగిన వెంటనే 112 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఈ ప్రభుత్వ పథకాన్ని వినియోగించుకోవాలని, ఆర్థిక భారాన్ని తగ్గించుకుని కుటుంబాలను రక్షించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

You missed