కందనవోలు ఆలూరు

ఆలూరు పట్టణంలోని ఆర్ & బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై వేడుకలను ఉత్సాహంగా జరిపారు.ముందుగా పార్టీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరి అన్న క్యాంటీన్‌కు చేరుకుని పేదలకు ఉచిత అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైకుంఠం జ్యోతి స్వయంగా ప్రజలకు భోజనాలు వడ్డిస్తూ సేవా కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 76 ఏళ్ల వయస్సులోనూ నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆయన శతాయుష్షుతో ఆరోగ్యంగా ఉండి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని దేవుని ప్రార్థిస్తున్నామని తెలిపారు.అలాగే ఆయన సతీమణి భువనేశ్వరి రాష్ట్రవ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లలో ఉచిత భోజనం కోసం స్వంత నిధులతో రూ.76 లక్షలు విరాళంగా ఇవ్వడం వారి కుటుంబ సేవాభావాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. పేదలు ఆకలితో ఉండకూడదనే ఆలోచన వారి కుటుంబ విలువలలో భాగమని వివరించారు.వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించాలని, పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆలూరు అభివృద్ధిని చూసి స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు చేయడం సరికాదని, అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టత ఇస్తున్నప్పటికీ విమర్శలు చేయడం బాధాకరమని తెలిపారు. ఈ అంశాన్ని ప్రజల తీర్పుకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి ఆర్గనైజేషన్ కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్, యువ నాయకుడు వైకుంఠం దినేష్, ఆలూరు మండల కన్వీనర్ శ్రీనివాసులు, ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటేశ్వర్లు,సొసైటీ చైర్మన్ ఈరన్న, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ వీర నాగప్ప, కొమ్ము రాజు పలు మండలాల కన్వీనర్లు సొసైటీ చైర్మన్లు జిల్లా కమిటీ సభ్యులు నర్సప్ప, హొలగుంద మండల ప్రధాన కార్యదర్శి ఈ బిజీ గోవింద్ గౌడ్, పలువురు టిడిపి నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.
