పులివెందులలో వాహన తనిఖ
కందనవోలు పులివెందుల
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పులివెందుల పట్టణంలో పోలీసులు శుక్రవారం ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ మరియు అర్బన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఈ తనిఖీలను పర్యవేక్షించారు. వాహనదారుల ఆపి హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ (RC), మరియు ఇన్సూరెన్స్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనదారులను స్టేషన్కు పిలిపించి, వారికి రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన కల్పించారు. ఇటీవల కాలంలో జరిగిన వివిధ ప్రమాదాలను ఉదాహరణగా చూపిస్తూ, నిబంధనలు పాటించకపోవడం వల్ల కలిగే నష్టాలను వివరించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మరియు అన్ని రకాల ఒరిజినల్ పత్రాలను వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి మురళి నాయక్ అర్బన్ ఎస్సై మధుసూదన్ రెడ్డి వారి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
