ఆలూరు మండల కేంద్రంలో స్థానిక కోటవీధిలో వెలసిన శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవాలయం నందు శ్రీ గౌరీ దేవి (గౌరమ్మ) పండగ వేడుకలలో భాగంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణతో దర్శనమిస్తారు. కావున గ్రామ ప్రజలు, భక్తులు గమనించి నోములు నోచేవారు, సాయంత్రం సక్రహారతులు అమ్మవారి బేలిగి, దేవి ఆశీస్సులు పొందాలని ఆలయ అర్చకులు కోరారు. అనంతరం రాత్రి శ్రీ గౌరీ దేవి ఉత్సవమూర్తితో ఊరేగింపు కార్యక్రమం జరుగును. కావున గ్రామ ప్రజలు, భక్తాదులు పాల్గొని, శ్రీ గౌరి దేవి కృపాకు పాత్రులు కాగలరు అని మనవి. కార్యక్రమంలో ఆలయ అర్చకులు మల్లికార్జున స్వామి, ఎర్రిస్వామి, సతీష్ స్వామి మరియు గ్రామ పెద్దలు మరియు భక్తాదులు సమక్షంలో నిర్వహించబడును.
