నూజివీడు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘీయుల కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం చైతన్య గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ బ్రహ్మశ్రీ  కమ్మరి పార్వతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.బ్రహ్మశ్ర ఆచార్య మోహనరావు శర్మ  ఆధ్వర్యంలో సామూహిక విశ్వకర్మ వ్రత పూజ నిర్వహించారు. అనంతరం చైర్పర్సన్  మాట్లాడుతూ, విశ్వబ్రాహ్మణులు ఐక్యంగా ఉండి పంచ వృత్తుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.ఈ వేడుకలో కార్పొరేషన్ డైరెక్టర్ మోడేపల్లి నాగు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పావులూరి హనుమంతరావు, భవిరి రవి, కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు తాటికొండ రంగబాబు, విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గొర్తి శ్రీనివాస చక్రవర్తి, ఫోరం ఫర్ డెమోక్రసి (A.P.) కన్వీనర్ డా. కొత్తపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

You missed