కందనవోలు ఆలూరు

 

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లు దేవకుంట గ్రామంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ సభ ఘనంగా జరిగింది. హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మరియు బీజేపీ సీనియర్ నాయకుడు పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆలూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పురుషోత్తం రెడ్డి, ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధతతో పనిచేస్తున్న గుమ్మనూరు నారాయణ వంటి నాయకుడిని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం మనందరి కర్తవ్యమని అన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ గుమ్మనూరు నారాయణకు ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బసవరాజు కూటమి నాయకులు, మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…

You missed