కందనవోలు కర్నూలు

 

దివ్యాంగుల సాధికారతకు,సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు… నగరంలోని సంజయ్ గాంధీ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం మరియు విభిన్న ప్రతిభావంతుల యువసేన అసోసియేషన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు..ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు,భవిత కేంద్రాల ద్వారా విద్య, వైద్య సహాయం, మరియు స్వయం ఉపాధి కోసం ఆర్థిక సబ్సిడీలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు..దివ్యాంగులు రాజకీయంగా ఎదగాలన్న లక్ష్యంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేక కోట ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నాయన్నారు..ఇక వికలాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ తెలిపారు…అనంతరం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సందర్భంగా వికలాంగులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్.టీ.ఆర్ విగ్రహం తో పాటు మోదీ, చంద్రబాబు, పవన్,లోకేష్ చిత్రపటాలకు ఎంపీ నాగరాజు పాలాభిషేకం చేశారు…ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు,వయో వృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ గడపూటి నారాయణ స్వామి, జిల్లా శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగరాజు,విభిన్న ప్రతిభావంతుల యువసేన అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు…

You missed