అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గస్తీలు , తనిఖీలు ముమ్మరం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా పటిష్ఠంగా గస్తీ విధులు నిర్వహిస్తున్నారు .జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిల్లోని నేర నియంత్రణకు , అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భద్రతా చర్యలు చేపట్టారు.అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను తనిఖీలు చేపట్టడం, రోడ్డు ప్రమాదాల నివారణకు ఓపెన్ డ్రింకింగ్ ల కట్టడిపై దృష్టి సారించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.వాహనాల తనిఖీలు చేపట్టి రోడ్డు భద్రత నిబంధనల పై అవగాహన కల్పిస్తున్నారు.నేరాలను నియంత్రించడానికి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
