కందనవోలు ఆలూరు

 

గత సంవత్సరం ఏప్రిల్ 20 2025 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొంటూ గుండెపోటుతో మరణించిన కీర్తిశేషులు సురేంద్ర నాయుడు వర్ధంతి సందర్భంగా ఆలూరులో నిర్వహించిన కార్యక్రమం భావోద్వేగ వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, సురేంద్ర నాయుడు కుటుంబ పరిస్థితిపై టిడిపి అధిష్టానం సానుకూలంగా స్పందించాలని కోరారు. సురేంద్ర నాయుడు పదిహేనేళ్లకు పైగా పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన నాయకుడని, చిన్న స్థాయి కార్యకర్తగా ప్రారంభించి జిల్లా స్థాయికి ఎదిగిన ఆయన సేవలను మరువలేమని అన్నారు. పార్టీ కార్యక్రమాల కోసం స్వంతంగా ఖర్చులు పెట్టి కృషి చేసిన ఆయన కుటుంబం ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటుండటం బాధాకరమని తెలిపారు.మాజీ జడ్పిటీసీ రాంభీమ్ నాయుడు మాట్లాడుతూ, సురేంద్ర మరణ సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని పలువురు నాయకులు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆ హామీలను నెరవేర్చుతూ కుటుంబానికి ఆర్థిక, సామాజిక భరోసా కల్పించాలని టిడిపి అధిష్టానాన్ని కోరారు.వాల్మీకి సామాజిక వర్గం తరఫున సురేంద్ర కుటుంబానికి అండగా నిలుస్తామని, అవసరమైతే పార్టీ ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి న్యాయం జరిగేలా ఒత్తిడి తీసుకువస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు సురేంద్ర సమాధి వద్ద పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి, పార్టీ నుంచి తగిన సహాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

You missed