ట్రేడింగ్ పేరిట జరుగుతున్న స్కామ్స్ తో జాగ్రత్త వాట్సాప్ , ఇన్ స్టా గ్రామ్ , టెలిగ్రామ్ లో వచ్చే యాడ్స్ నమ్మొద్దు.లక్ష పెట్టుబడితే కోట్లు వస్తాయంటే ఖచ్చితంగా మోసమే. ఈజీ మనీ కోసం ఆశపడి ఖాతా ఖాళీ చేసుకోవద్దు. ఎపికె ఫైల్స్ ఇన్ స్టాల్ చేయొద్దు, అపరిచిత లింక్స్ క్లిక్ చేయొద్దు.కొన్ని నకిలీ పెట్టుబడి కంపెనీలు, సోషల్ మీడియా, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు ద్వారా అత్యధిక లాభాలు లేదా గ్యారంటీ ప్రాఫిట్లు ఇస్తామని చెప్పి బాధితులను ఆకర్షిస్తున్నారని , నకిలీ వెబ్సైట్లు, ట్రేడింగ్ డాష్బోర్డులు, యాప్లు వాడి నకిలీ లాభాలు చూపిస్తూ మరిన్ని పెట్టుబడులు పెట్టమని ప్రలోభపెడతారని , పౌరులు నిర్ధారించని ప్లాట్ఫారమ్లలో పెట్టుబడి పెట్టకుండా, ఆన్లైన్ లాభ వాగ్దానాలను నమ్మకూడదని, ప్రజలను తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని ప్రచారం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.ఇటువంటి సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.కొందరు నమ్మకం కల్పించినట్టు , షేర్లు, బంగారం, ఆన్‌లైన్ ట్రేడింగ్ తదితర పేర్లతో నకిలీ వెబ్‌సైట్లు, యాప్స్ ద్వారా మోసం చేస్తున్నారు.ఇటీవల సందర్భాల్లో కర్నూలు యన్ ఆర్ పేటకు చెందిన వ్యక్తి ఇలా ఇన్వెస్ట్‌మెంట్ లింక్ లతో మోసపోయారు.ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తక్కువలో ఎక్కువ లాభాలు ఇస్తారు అనే వారి మాటలను నమ్మవద్దు. ఆ సంస్థ యొక్క గుర్తింపు, అనుమతుల వివరాలు పరిశీలించండి.పర్సనల్ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకండి.సోషల్ మీడియా, ఆన్‌లైన్ ద్వారా వచ్చే లింక్స్‌ని క్లిక్ చేయకుండా ఉండండి.ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలపై ప్రజల అవగాహన కు సూచనలు:1. పెట్టుబడి చేసే ముందు ధృవీకరించుకోండి:ట్రేడింగ్ ప్లాట్ఫారమ్లు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు నిజమైనవో కాదో తెలుసుకోండి. SEBI (Securities and Exchange Board of India) వద్ద రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ ఉన్నాయో లేదో చూసుకోండి.సోషల్ మీడియా ద్వారా వచ్చిన లింకులు లేదా ఆఫర్లను నమ్మకండి.2. అధిక లాభాల వాగ్దానాలను అనుమానించండి:తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు గ్యారంటీగా వస్తాయని చెప్పేవారిని నమ్మకండి.3. వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలు పంచుకోవద్దు:బ్యాంక్ అకౌంట్ నంబర్లు, OTPలు, పాస్వర్డ్లు, UPI PINలు వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.4. “ప్రాసెసింగ్ ఫీజులు” లేదా అదనపు చార్జీలు చెల్లించవద్దు:మోసగాళ్లు పన్నులు లేదా ఫీజుల పేర్లతో డబ్బు వసూలు చేస్తారు. నిజమైన ట్రేడింగ్ ప్లాట్ఫారమ్లు ఎప్పుడూ డబ్బు అడగవు.5. నకిలీ ప్లాట్ఫారమ్లు మరియు వాలెట్లను గుర్తించండి:అసాధారణ లాభాలు చూపించే లేదా విత్డ్రాయల్ నిరంతరం ఆలస్యం చేసే యాప్లు/సైట్లు (red flags) గా పరిగణించండి.6. బెదిరింపులకు లోనవ్వకండి:లీగల్ యాక్షన్ లేదా అకౌంట్ ఫ్రీజ్ అవుతుందంటూ భయపెట్టినా, శాంతంగా ఉండండి మరియు తక్షణ చెల్లింపులు చేయవద్దు.ఎలాంటి అనుమానాస్పద లింకులు వచ్చినా క్లిక్ చేయకుండా ఉండండి. మోసానికి గురైతే వెంటనే స్థానిక పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ సెల్‌కు ఫిర్యాదు చేయండి.ఫిర్యాదు కు టోల్ ఫ్రీ నంబర్ మీరు పెట్టుబడి మోసం లేదా సైబర్ మోసం ఎదుర్కొంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930 కి కాల్ చేయండి. అలాగే www.cybercrime.gov.in లో కూడా ఫిర్యాదు నమోదు చేయొచ్చు.మీ సమాచారం గోప్యంగా ఉంటుంది. బాధితులు భయపడకుండా పోలీసులను సంప్రదించండి.మీ డబ్బు – మీ భద్రత, పెట్టుబడి చేసే ముందు పూర్తిగా ఆలోచించండి. మోసపోయిన ఇతరులకు కూడా 1930 టోల్ ఫ్రీ నంబర్ సమాచారాన్ని చేరవేయాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
