కందనవోలు కర్నూలు

ఈనెల 11నుండి పినాక ఉచిత శిక్షణ తరగతులు

నగరపాలక సంస్థ అకౌంట్స్ ఆఫీసర్ కె.రఘునందన్

రాయలసీమ రవికుమార్.
కోర్స్ డైరెక్టర్,పినాక
రాష్ట్ర అధ్యక్షులు, ఆర్వీపీఎస్

కర్నూలు:-పినాక ప్రజా సాధికార ట్రస్టు మరియు విశాఖపట్నం ఇన్కమ్ టాక్స్ కమిషనర్ బి.యాదగిరి,అమిలియో హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని శ్రీలక్ష్మీ హైస్కూల్ లో ఈ నెల 11వ తేదీ నుండి మొదలయ్యే స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూ స్కిల్స్,పర్సనాలిటీ డెవలప్మెంట్,బ్యాంకింగ్,గ్రూప్స్,సివిల్స్ గైడెన్స్ ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ అకౌంట్స్ ఆఫీసర్ కె.రఘునందన్, పినాక కోర్స్ డైరెక్టర్, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్,ప్రముఖ గణిత అధ్యాపకులు ఈశ్వరయ్య,ఎస్టీబీసీ కళాశాల ప్రిన్సిపాల్ సునీతా రోజ్,డాక్టర్ శ్రీహరి,మదాసి/మదారి కురువ సంఘాల నాయకులు కురువ ఎల్లప్ప,మదాసికురువ తిరుమలేశు,మదాసికురువ సుంకన్న,బత్తిన కిరణ్ కుమార్ కోరారు.
కర్నూలు నగరంలోని స్థానిక ఎన్ ఆర్ పేట లో గల శ్రీలక్ష్మి హై స్కూల్ లో పినాక ఉచిత శిక్షణ తరగతుల కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు.
గత 13సంవత్సరాలుగా రాయలసీమ జిల్లాల్లో పినాక ప్రజా సాధికార ట్రస్టు ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, గ్రూప్స్, సివిల్స్ గైడెన్స్ కోర్సును ఈ సంవత్సరం కర్నూలు నగరంలోని మున్సిపల్ ఆఫీస్ వద్ద ఎన్,ఆర్ పేటలో గల శ్రీలక్ష్మీ హైస్కూల్ లో నిర్వహిస్తున్నామని విద్యార్ధులకు ఉచితంగా కోర్సుతో పాటు ఉచితంగా కోర్స్ మెటీరియల్, మధ్యాహ్నం ఉచిత భోజన సదుపాయం, అమ్మాయిలకు ఉచిత హాస్టల్ వసతి ఏర్పాటు చేసామని అడ్మీషన్ల కోసం కోర్స్ డైరెక్టర్ రాయలసీమ రవికుమార్ సెల్:9177764147,9640969891 నెంబర్లను సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కురువ,మదాసి/మదారి కురువ సంఘాల నాయకులు శ్రీనివాసులు,కల్లూరు శివ, భరత్ కుమార్,కురువ లాలి,కె.రాము,అడ్వకేట్ గణేష్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

You missed