కందనవోలు కర్నూలు

ఆర్ముడు రిజర్వుడ్ లో ఆర్ఎస్ఐలుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల సివిల్ ఎస్ఐలుగా పదోన్నతి పొందిన 19 మంది శుక్రవారం కర్నూలులోని డీఐజీ రేంజ్ కార్యాలయంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా డీఐజీ వారికి శుభాకాంక్షలు తెలియజేసి, పదోన్నతి అనంతరం మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు సత్వర న్యాయం అందించే విధంగా పోలీసులు కృషి చేయాలని తెలిపారు.క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో పనిచేస్తూ శాఖ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐలుగా పదోన్నతి (2009, 2012, 2015, 2018 బ్యాచ్ ల ) పొందిన 19 మంది అధికారులు పాల్గొన్నారు.
