కందనవోలు కర్నూలు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కృషి చేసిన, సమయాన్ని అంకితం చేసిన నాయకులను గుర్తించి బాధ్యతలు అప్పగించడం చాలా సంతోషకరమైన విషయం. కౌశిక్ వాయుగండ్ల వంటి కృషి, నిబద్ధత కలిగిన యువ నాయకుడిని రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకమైన బోర్డులో డైరెక్టరుగా నియమించడం టిడిపి నాయకత్వం యొక్క దూరదృష్టిని ప్రతిబింబిస్తోంది” అన్నారు.
అలాగే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం శ్రమించిన వారికి ప్రదమైన పదవులు ఇచ్చి ప్రోత్సహించడం ద్వారా టెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారని చెప్పారు.
చంద్రశేఖర్ ఇంకా మాట్లాడుతూ మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ కృషి, విశ్వాసం ఉన్న కార్యకర్తలకు గుర్తింపు ఇస్తూ, వారిని ప్రజా సేవకు ప్రోత్సహిస్తున్నారు. ఈ నియామకం ద్వారా కౌశిక్ వాయుగండ్ల పరిశ్రమల అభివృద్ధికి, యువతకు అవకాశాల సృష్టికి కృషి చేస్తారని మా విశ్వాసం” అన్నారు.
