కందనవోలు కర్నూలు,

కర్నూలుకు చెందిన పదవ తరగతి విద్యార్థిని కే. శృతి గత నాలుగు సంవత్సరాలుగా డీ.ఎస్.ఏ స్విమ్మింగ్ పూల్‌లో క్రమం తప్పకుండా స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ ప్రతిభ కనబరుస్తున్నారు.ఈ నాలుగు సంవత్సరాల కాలంలో స్విమ్మింగ్ అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో అనేకసార్లు అగ్రస్థానంలో నిలిచి, రెండు సార్లు జాతీయ స్థాయిలో పాల్గొన్నది.అలాగే, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో మూడుసార్లు ప్రతిభ కనబరిచి, జాతీయస్థాయికి ఎంపికయ్యారు.ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఏపీ సబ్ జూనియర్, జూనియర్ స్టేట్ లెవెల్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ – 2025లో, గ్రూప్–2 విభాగంలో 200 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్, 800 మీటర్స్ ఫ్రీ స్టైల్ ఈవెంట్స్‌లో బ్రాంజ్ మెడల్స్ సాధించారు.అదే విధంగా, పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈనెల 3న జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రస్థాయి పోటీల్లో, అండర్–17 విభాగంలో 100 మీటర్స్ బట్టర్‌ఫ్లై, 200 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్ ఈవెంట్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు.డిసెంబర్ 12 నుంచి న్యూఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.ఆమె ప్రతిభను గమనించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్  ఎస్. అబ్దుల్ నజీర్ అభినందనలు తెలియజేశారు. రాష్ట్రానికి గౌరవం తెచ్చేలా మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

You missed