కందనవోలు కర్నూలు

కాకినాడలో 15 మరియు 16 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీలలో స్థానికంగా నివసిస్తున్న చిన్నారి షేక్ సాయిదా ప్రతిభ కనబరిచి కాంస్య పథకం సాధించింది. వైట్ కలర్ హెల్మెట్ ధరించి క్రీడా మైదానం లోకి ప్రవేశించిన సాయిదా, వివిధ విభాగాల్లో జరిగిన పోటీల్లో ధైర్యంగా పాల్గొని తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది.
ప్రతి రౌండ్‌లో ప్రత్యర్థులతో ధైర్యంగా పోటీ పడి, తాను నేర్చుకున్న   టైక్వాండో  సాంకేతికత లను సమర్థంగా ఉపయోగించు కున్న సాయిదా ప్రదర్శనకు నిర్వాహకులు మరియు ప్రేక్షకులు విశేషంగా అభినందనలు తెలిపారు.చిన్న వయస్సులోనే ఇంత ధైర్యం, క్రమశిక్షణ చూపడం నిజంగా ప్రేరణగా నిలుస్తుందని క్రీడా గురువులు అభిప్రాయపడ్డారు.
పోటీల అనంతరం సాయిదాకు జడ్జీలు ప్రశంసలు తెలియ జేయగా, భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు,గురువులు ఆమె విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

You missed