కందనవోలు తిరుపతి,

నవంబర్ 20, 21వ తేదీలలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  తిరుపతి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం రేణిగుంట ఎయిర్పోర్ట్ నుండి తిరుచానూరు, తిరుమల పద్మావతి అతిధి గృహం, రాంభగీచ్చా, శ్రీ వరాహ స్వామిని ఆలయం,శ్రీ వారి ఆలయం వరకు రిహర్సల్ చేసారు.నంతరం టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, విజిలెన్స్ అధికారులతో కలసి  భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము  పర్యటించు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి లోపాలు లేకుండా  భారత రాష్ట్రపతి  పర్యటను విజయ వంతం చేయాలని విధులు కేటాయించిన అధికారులందరిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో టిటిడి, విజిలెన్స్ మరియు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

 

You missed