కందనవోలు అనంతపురం

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి మండలం నుంచి అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద 2025- 26వ సంవత్సరానికి సంబంధించి రెండవ విడత నిధులు విడుదల చేసే కార్యక్రమంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉరవకొండ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద 2025- 26వ సంవత్సరానికి సంబంధించి రెండవ విడత నిధులు విడుదల చేసే జిల్లా స్థాయి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, వ్యవసాయ జెడి ఉమామహేశ్వరమ్మ, ప్రకృతి వ్యవసాయం డిపిఎం లక్ష్మనాయక్, ఎడి సత్యనారాయణ, ఏవో రామకృష్ణ, స్థానిక టిడిపి నాయకులు, రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పీఎం కిసాన్ 21వ విడత – అన్నదాత సుఖీభవ రెండవ విడత కార్యక్రమము కింద ఒక్కొక్క రైతుకు 7,000 రూపాయలు అకౌంట్ కు జమ చేయడం జరిగిందన్నారు. ఇందులో అన్నదాత సుఖీభవ కింద 5,000 రూపాయలు, పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు ప్రతి రైతు అకౌంట్ కు జమ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 2,75,642 మంది రైతులకు రూ.188.98 కోట్లు రైతుల అకౌంట్లకు జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లా ఉద్యాన పంటల సాగుకు అనుకూలంగా ఉంటుందని, ప్రతి ఏడాది 20 వేల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని, దీనితో ప్రతి ఎకరాకు నీరు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో హంద్రీనీవా కాలువ వచ్చాక నీటి వనరులు పెరిగాయన్నారు. ప్రకృతి వ్యవసాయము మరియు ఉద్యాన పంటల పైన ఎక్కువగా దృష్టి పెట్టవలసిందిగా రైతులకు సూచించారు.అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద 2025- 26వ సంవత్సరానికి సంబంధించి నిధులు విడుదల చేసే కార్యక్రమమును  ప్రధానమంత్రివర్యులు నరేంద్రమోదీ  కోయంబత్తూర్ లో,  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ప్రారంభించగా, ఈ కార్యక్రమాన్ని యొక్క లైవ్ టెలికాస్ట్ ద్వారా వీక్షించడం జరిగింది. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద ఉరవకొండ నియోజకవర్గంకు సంబంధించి 47,680 మంది రైతులకు రూ.32.83 కోట్లు రైతుల అకౌంట్లో జమ చేయడం జరగగా, ఉరవకొండ మండలంలో 8,818 మంది రైతులకు 6 కోట్ల రూపాయిలు రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి రైతులకు మెగా చెక్కును జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ మాట్లాడుతూ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ కింద ఏమైనా సమస్యలు ఉంటే రైతు సేవా కేంద్రాలకు వెళ్లి వారి సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు

 

You missed