కందనవోలు కర్నూలు
ఎక్సైజ్ కమిషనర్  చామకూరి శ్రీధర్ మరియు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్  రాహుల్ దేవ్ శర్మ (విజయవాడ) అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా జిల్లా వాసులను ఉద్దేశించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా నాటుసారా తయారీ, విక్రయాలను పూర్తిగా అరికట్టడం, మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టడం, నాటుసారా తయారీపై ఆధారపడిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన ద్వారా ఇతర వృత్తులవైపు మళ్లించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలించే మద్యం ప్రవేశాన్ని కూడా పూర్తిగా అరికట్టేలా కఠిన పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.
సమావేశం అనంతరం కర్నూలు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ శ్రీదేవి, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ ఆర్. హనుమంతరావు, జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి సుధీర్ బాబు ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా లో ప్రొహిబిషన్ అమలు, నాటుసారా నియంత్రణ, అక్రమ మద్యం రవాణా నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.

You missed