కందనవోలు శ్రీశైలం

ఉదయానికి అమావాస్య ఘడియలు రావడంతో శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామి వారికి దేవస్థానం విశేషపూజలను నిర్వహిస్తున్నది. ఈ సాయంకాలం పూజాదికాలు నిర్వహించబడుతాయి.ప్రతీ మంగళవారం, అమావాస్యరోజులలో ఈ విశేషార్చనను జరిపించడం జరుగుతోంది.కాగా అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్షసేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశం కల్పించబడింది.ఈ రోజు పరోక్షసేవ ద్వారా 39 మంది భక్తులు ఈ విశేషపూజలను జరిపించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుండేకాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, పంజాబ్ తదితర ప్రదేశాల నుండి కూడా భక్తులు ఈ పూజలను జరిపించుకుంటున్నారు.కాగా ఈ పూజాదికాల కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజను నిర్వహించబడుతుంది.ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో వీరభద్రస్వామివారికి అభిషేకం జరిపించబడుతుంది.ఈ స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడుతాయని, అరిష్టాలన్నీ తొలగి పోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని, ప్రమాదాలు నివారించబడతాయని, సర్వకార్యానుకూలత లభిస్తుందని, అభీష్టాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.కాగా ఈ పరోక్షసేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం మొదలైనవాటిని ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలియజేయడం జరుగుతుంది.సేవాకర్తలేకాకుండా భక్తులందరు కూడా వీటిని శ్రీశైలటి.వి / యూ ట్యూబ్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించబడుతుంది.ఇతర వివరములకు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 83339 01351 / 52 / 53 / లను సంప్రదించవచ్చును

You missed