కందనవోలు నంద్యాల

నంద్యాల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరప్రవృత్తిని అరికట్టే చర్యలు తీసుకోవాలన్న జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ I ఆదేశాలమేరకు జిల్లా పోలీసు అధికారులు వారి వారి పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు నేడు కౌన్సిలింగ్ నిర్వహించారు.కౌన్సిలింగ్ హాజరైన నేరచరిత్ర గల వ్యక్తులకు, చట్టాన్ని గౌరవించి సత్ప్రవర్తనతో జీవించాలని అధికారులు సూచించారు. చట్టానికి విరుద్ధంగా నడుచుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తూ కుటుంబాల భవిష్యత్తు కోసం మార్పు అవసరమని వివరించారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. మళ్లీ నేరాల్లో పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.

 

You missed