కందనవోలు కర్నూలు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపిన మార్గంలో ప్రతి ఒక్కరి నడవాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సూచించారు..కర్నూలు కలెక్టరేట్ లో ని కాన్ఫరెన్స్ హాల్ నిర్వహించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలలో ఆయన పాల్గొన్నార…ఈ సందర్బంగా బాబా చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు… అనంతరం ఎంపీ మాట్లాడుతూ సత్యసాయి బాబా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు…బాబా తన ఆధ్యాత్మిక బోధనల ద్వారా ప్రపంచంలోని అనేక దేశాల్లో గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.. సత్యసాయి బాబా చూపిన సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస సిద్ధాంతలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు…ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ అమర్, సెట్కూరు సీఈఓ డాక్టర్.వేణుగోపాల్, సత్యసాయి బాబా ట్రస్ట్ సభ్యులు మరియు బాబా భక్తులు పాల్గొన్నారు..

You missed