కందనవోలు కర్నూలు
సీమ జల జీవనాడి గుండ్రేవుల జలాశయం సాధనకు సోమవారం నుండి 48 గంటల ‘జల సమర దీక్ష’ చేపట్టనున్నట్లు కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహర్ష ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 09:30 గంటలకు నగరంలోని రాజ్ విహార్ సెంటర్ పాత బస్ డిపో నుండి ధర్నా చౌక్ వరకు రైతులు, యువత, విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, అనంతరం ధర్నా చౌక్ వద్ద 48 గంటల ‘జల సమర దీక్ష’ చేపడతామన్నారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, ప్రజా సంఘాలను మద్దతు కోరామని, అన్ని పక్షాల ప్రజలు స్వచ్ఛందంగా కేపియస్ పోరాటానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
