కందనవోలు కర్నూలు

భగవాన్ సత్యసాయి బాబా  ప్రాజెక్ట్ ల నిర్మాణం పరంగా, వైద్య కళాశాలలు, విద్యా సంస్థల ఏర్పాటు పరంగా చేసిన సేవలు శాశ్వతం అని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు..ఆదివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా వేడుకలు నిర్వహించారు..ఈ సందర్భంగా కర్నూలు ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం సంతోషంగా ఉందన్నారు.. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో జన్మించారన్నారు.. అనంతపురం జిల్లా రాజస్థాన్ లాగా ఎడారి ప్రాంతంగా మారిపోతుందనే సమయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా  జన్మించి ప్రాజెక్ట్ లను నిర్మించి, వైద్య కళాశాలలు, విద్యా సంస్థలు నిర్మాణం చేసి అనంతపురం జిల్లాను అని విధాలుగా అభివృద్ధి చేసారన్నారు… భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అనంతపురం జిల్లాకు చేసిన సేవలు విస్తారమైనవి, శాశ్వతమైనవి, కోట్లాది మందికి ఉపయోగపడేవి అన్నారు. ఆయన సేవా కార్యక్రమాలు అనంతపురం జిల్లాలో విద్య, వైద్యం, నీటి సరఫరా, ఆధ్యాత్మిక పర్యాటకం వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయన్నారు… సాయి సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విద్యా, వైద్యం, మానవత, ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవలను అందించారన్నారు.. ఇవి బాబా  బోధనలైన సత్యం, ధర్మం, శాంతి మరియు ప్రేమ అనే నాలుగు సూత్రాల నుండి ప్రేరణతో నిర్వహించబడుతునాయన్నారు.. ప్రపంచ వ్యాప్తంగా 166 దేశాల్లో సాయి సేవా సంస్థలు ఉన్నాయన్నారు… మనందరం కూడా బాబా  ఆశయాలను పాటించాలన్నారు.. ట్రస్ట్ సభ్యులు అందరికి మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని, వారి నుండి సహాయ సహకారాలు జిల్లాకు ఎపుడు ఉండాలని కోరారు..జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మాట్లాడుతూ ప్రేమే మన మతం, ప్రేమే మన కులం అని భగవాన్ సత్యసాయి బాబా  చెప్పడం జరిగిందన్నారు… బాబా సేవా సమితి వారు నిస్వార్థ, అంకితభావంతో సేవలు అందిస్తారనే విషయాలను వినడం జరిగిందన్నారు.. అనంతపురంలో భగవాన్ సత్యసాయి బాబా  ఏర్పాటు చేసిన విద్యా సంస్థలను, వైద్యశాలను స్వయంగా సందర్శించడం జరిగిందన్నారు… అనంతపురం జిల్లా మొత్తం కరువు ప్రాంతంగా ఉండేదని అటువంటి తరుణంలో బాబా  ప్రాజెక్ట్ లను తీసుకొని వచ్చి ప్రజల నీటి సమస్యను తీర్చారన్నారు.. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే 5 సూత్రాల మీద బాబా  జీవితాన్ని గడపడం జరిగిందన్నారు.. మనం అందరం కూడా వాటిని పాటించాలన్నారు.. రాయలసీమ ప్రజలు కొంచెం ఏమైనా సహాయం చేసిన జీవితాంతం గుర్తు పెటుకుంటారన్నారు.. కర్నూలు లో నిరక్షరాస్యత కొంచెం ఎక్కువగా ఉందని, అక్షరాస్యత పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.. అందుకు గాను ఆర్గనైజేషన్ వారు కూడా సహకరించాలని కలెక్టర్ కోరారు… భగవాన్ సత్యసాయి బాబా  చెప్పిన సందేశాలు మనందరం పాటించాలన్నారు.కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, డి ఆర్ ఓ సి.వెంకట నారాయణమ్మ, సెట్కూర్ సీఈవో వేణుగోపాల్, ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర రెడ్డి, డి సి హెచ్ ఎస్ డా.జాఫ్రుల్లా, మలేరియా అధికారి నూకరాజు , ట్రస్ట్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, కన్వీనర్ అశోక్ కుమార్, పీ.లక్ష్మీ సరోజ, ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

You missed