కందనవోలు కర్నూలు

దక్షిణ శిరిడి సాయిబాబా దేవస్థానం నందు సాయి ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో మాల ధరించిన సకల దేవతా దీక్ష పరులందరికీ కార్తీక మాసంలో బిక్ష ఏర్పాటు చేసి నేడు సాయిబాబా దేవస్థానం నందు మహా బిక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి సేవా ఆదరణ సమితి అధ్యక్షులు రాజా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సాయిబాబా దేవస్థానం నందు గత 20 సంవత్సరాలుగా సకల
దేవతల మాల ధరించిన దీక్ష పరులందరికీ బిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు, సభ్యులకు, ఆలయ అర్చకులకు , సేవకులకు శాలువా, బహుమతులతో సన్మానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రియల్ టైమ్ నాగరాజు యాదవ్, విశ్వనాధ్ రెడ్డి, మహాబలేష్,శివ శంకర్, మంజునాథ్ , మధు, కుమార్, వెంకట రాముడు, సాయి సేవకులు పాల్గొన్నారు.

You missed