కందనవోలు కర్నూలు
మదాసి కురువ, మాదరి కురువ కులాలకు ఎస్సీ హోదా కల్పించి, తగిన కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయడంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ ను ఎంపీ బస్తిపాటి నాగరాజు కోరారు.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో పాల్గొంటున్న ఎంపీ, పార్లమెంటులోని కేంద్ర మంత్రి కార్యాలయంలో ఆయనను కలిసి కుల పత్రాల అవకాశ్యత గురించి వివరించి వినతి పత్రం సమర్పించారు… ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ మదాసి కురువ, మాదరి కురువ కులాలకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాల కోసం కురువ సంఘాలు ఎన్నో ఏళ్లుగా పోరాటలు చేస్తున్నారని, ఎస్సీ హోదా లభించకపోవడంతో విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు పొందడంలో ఇబ్బందులకు ఎదురుకుంటున్నారని మంత్రి దృష్టి కి తీసుకెళ్లాన్నారు.. దీని పై స్పందించిన మంత్రి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు…
