కందనవోలు కర్నూలు
కల్లూరు అర్బన్ పరిధిలోని పలు వార్డులలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొని పలు ప్రాంతాల్లో భూమి పూజ చేశారు.21వ వార్డులోని ఎన్జీవోస్ కాలనీ, FCI కాలనీ–2 ప్రాంతాల్లో రూ. 1 కోటి 40 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్లు, WBM రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.అలాగే 20వ వార్డులోని వాసవి నగర్, జయరాం నగర్ ప్రాంతాల్లో రూ. 50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన జరిగింది.26వ వార్డులోని సవరమ్మ కాలనీలో రూ. 82 లక్షలతో చేపట్టే సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు కూడా పూజలు చేశారు.35వ వార్డులోని ఉమా మహేశ్వర నగర్, కల్లూరు ఎస్టేట్ నాగులకట్ట ప్రాంతాల్లో రూ. 67 లక్షల విలువైన WBM రోడ్డు, బీటీ రోడ్ నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ కమ్మరి పార్వతమ్మ, సంబంధిత ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
