కందనవోలు న్యూస్ కర్నూలు

కర్నూలు శివారులోని రవాణా శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించరు. ఈ సందర్భంగా రవాణా కమీషనర్ ఆదేశాల మేరకు 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు – 2026 జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రము 4.00 గంటలకు ఉపరవాణా కమీషనర్ కార్యాలయము, బి.తాండ్రపాడు, కర్నూలు నందు కాంట్రాక్టు క్యారేజ్ మరియు టూరిస్ట్ బస్సు ఓనర్స్ తో సమావేశము నిర్వహించడమైనది. ఉపరవాణా కమీషనర్ బస్సు యజమానులకు సంక్రాంతి పండుగ సందర్భముగా అదిక బస్సు చార్జీలు వసూలు చేయవద్దని ఆమె అన్నారు, బస్సులో రెండవ డ్రైవర్ ఉండాలి మరియు రోడ్డు భద్రత నియమాలను ఖచ్చితముగా పాటించాలని తెలియచేసారు, నిబంధనలను అతిక్రమించిన బస్సులపై కేసులు నమోదు చేస్తామని తెలియచేసారు.
మరియు ప్రతి బస్సులో హెల్ప్ లైన్ ( హెల్ప్ లైన్ ) నంబర్+91- 9281607001 డిస్ప్లే చేయాలి. బసుకు సంబంధించిన అన్ని వాలిడ్ పత్రాలు ఫిట్నెస్ సర్టిఫికెట్, టాక్స్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్స్ మరియు భద్రతా ప్రమాణాలు ( ఎమర్జెన్సీ దారి, ఫైర్ ఎక్స్టింగుషర్స్, సేఫ్టీ హ్యామర్, ఫస్ట్ ఎయిడ్ కిట్) పాటించాలి. బస్సులో పేలుడు పదార్థాలు, కమర్షియల్ సామాన్లు) తీసుకొని వెళ్ళరాదు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపరవాణా కమీషనర్ ఎస్. శాంత కుమారి, మోటార్ వాహనముల తనిఖీ అధికారులు కె. రవీంద్ర కుమార్, ఎస్. నాగరాజ నాయక్, యం.వి.సుధాకర్ రెడ్డి, ఎన్. గణేష్ బాబు మరియు సిబ్బంది, కాంట్రాక్టు క్యారేజ్ మరియు టూరిస్ట్ బస్సు ఓనర్స్లు పాల్గొన్నారు.
