కందనవోలు కొలిమిగుండ్ల

స్వతంత్ర తొలి సమరయోధుడు వడ్డెర ఓబన్న జయంతి వేడుకలు మండలంలోని అంకిరెడ్డి పల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు హాజరయ్యారు.
కార్యక్రమం లో ముందుగా స్వతంత్ర సమర యోధుడు ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సిఐ రమేష్ బాబు, నంద్యాల రమేష్ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో పోరాడిన వీర యోధుడు వడ్డే ఓబన్న అని, ఆయన సాహసం, త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుత యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర ఓబన్న జయంతి ని వైభవంగా జరుపుతుందని అన్నారు.అనంతరం ఓబన్న జయంతి సందర్బంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నంద్యాల నారాయణరెడ్డి, నంద్యాల రమేష్ రెడ్డి,రవి ప్రకాష్ రెడ్డి, అంకిరెడ్డిపల్లి వడ్డెర సంఘం నాయకులు మాజీ ఎంపీటీసీ బండ సుబ్బరాయుడు,డేరింగుల సుబ్బరాయుడు,బత్తుల గోపాల్, మంజుల సుబ్బరాయుడు,బండ శివాజీ,బత్తల లక్ష్మన్న,బండ పెద్ద బజ్జయ్య,మక్కల మద్దిలేటి, సుధాకర్, విజయ భాస్కర్, బుజ్జి నాగాంజనేయులు, జగన్మోహన్, గోల్కొండ శేఖర్ వీరాంజి బాలకృష్ణ, రాముడు, కుల బంధువులు పాల్గొన్నారు.

You missed