కందనవోలు కర్నూలు
కందనవోలు జాతీయ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆంధ్రప్రదేశ్ కురువ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ రామకృష్ణ కోడుమూరు జనసేన నాయకుడు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నిజాయితీతో కూడిన వార్తలను అందిస్తూ సమాజానికి దిశానిర్దేశం చేస్తున్న కందనవోలు పత్రిక సేవలు ప్రశంసనీయమని అన్నారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరిచే పాత్రను మీడియా పోషిస్తుందని, అందులో భాగంగా కందనవోలు పత్రిక విశేష కృషి చేస్తోందని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కందనవోలు జాతీయ దినపత్రిక సంపాదకులు, కే శ్రీనువాసులు మధు సంధ్య ప్రసాదు సిద్ధారెడ్డి అశోకు నవీన్ రాజు ప్రతినిధులు, ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. నూతన క్యాలెండర్ విడుదల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
