కందనవోలు కర్నూలు
డాక్టర్ నిఖిల్ తెన్నేటి
చీఫ్ నియోనాటాలజిస్ట్ & నియోనాటాలజీ విభాగాధిపతి
కిమ్స్ కడల్స్, సీతమ్మధార
జనవరి నెలను జాతీయ జన్మ లోపాల నివారణ నెలగా పాటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలను ప్రభావితం చేసే జన్మజనిత లోపాలపై అవగాహన పెంచే కీలక సమయం ఇది. ఈ ఏడాది థీమ్ “ప్రతి ప్రయాణం ముఖ్యం” పిల్లలు ఆరోగ్య సవాళ్లతో పుట్టినా లేకపోయినా, ప్రారంభం నుంచే అందే సరైన సంరక్షణ, మద్దతు, వైద్యచికిత్సలపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఈ సందేశం గుర్తుచేస్తోంది.
పుట్టుకతో వచ్చే లోపాలు అనేవి పుట్టుకతోనే ఉండే శారీరక మార్పులు. ఇవి గుండె, మెదడు, కాళ్లు వంటి శరీరంలోని ఏ భాగాన్నైనా ప్రభావితం చేయవచ్చు. కొన్ని లోపాలు జన్యుపరమైనవిగా నివారించలేనివైనా, చాలా వరకు ముందస్తు జాగ్రత్తలు, సకాలంలో గుర్తింపు, ఆధునిక వైద్యచికిత్సలతో నివారించవచ్చు లేదా సమర్థంగా నిర్వహించవచ్చు.
నివారణే కీలకం
అన్ని పరిస్థితులను నియంత్రించలేకపోయినా, గర్భధారణకు ముందు మరియు గర్భధారణ సమయంలో తీసుకునే జాగ్రత్తలు ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తాయి. ముఖ్యమైన అంశాలు ఇవి:
ఫోలిక్ యాసిడ్ అత్యవసరం: రోజుకు 400 మైక్రోగ్రాముల (mcg) ఫోలిక్ యాసిడ్‌ను గర్భధారణకు కనీసం ఒక నెల ముందే ప్రారంభించడం ద్వారా మెదడు, వెన్నుపాము లోపాలు (న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్) నివారించవచ్చు.
టీకాలు: రుబెల్లా, ఫ్లూ వంటి టీకాలు తల్లి తీసుకోవడం ద్వారా తీవ్ర లోపాలకు దారితీసే సంక్రమణల నుంచి రక్షించవచ్చు.
దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ: మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు గర్భధారణకు ముందు నుంచే కట్టుదిట్టంగా నియంత్రణలో ఉండాలి.
హానికర పదార్థాలకు దూరం: మద్యం, పొగాకు, మత్తుపదార్థాలు గర్భధారణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సురక్షితం కాదు. వీటిని పూర్తిగా నివారించాలి.
నియమిత గర్భసంరక్షణ: క్రమమైన పరీక్షలతో సమస్యలను తొందరగా గుర్తించి, పుట్టకముందే జీవరక్షక చర్యలను ప్రణాళిక చేయవచ్చు.
కిమ్స్ కడల్స్‌లో ఆధునిక చికిత్సలతో ఆశ.
పుట్టుకలో వచ్చిన లోపాలను గుర్తించినా ప్రయాణం అక్కడితో ఆగిపోదు. అది ప్రత్యేక సంరక్షణ అవసరమైన కొత్త దారిలో కొనసాగుతుంది. కిమ్స్ కడల్స్ లో ఇటువంటి కుటుంబాలకు ప్రపంచస్థాయి క్వాటర్నరీ కేర్ అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం.
శిశువుకు జన్మజనిత లోపం ఉందని తెలిసినప్పుడు తల్లిదండ్రులకు కలిగే ఆందోళనను మేము అర్థం చేసుకుంటాం. అందుకే అత్యంత సంక్లిష్ట కేసులకూ సమగ్ర చికిత్స వ్యవస్థను అందుబాటులో ఉంచాం:
నవజాత శిశువులు & పిల్లల కార్డియాక్ నైపుణ్యం: పుట్టుకతో వచ్చే లోపాల్లో గుండె లోపాలు సాధారణం. నూతన శిశువులకు సంక్లిష్ట గుండె శస్త్రచికిత్సలు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ విధానాలు నిర్వహించేందుకు ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
అధునాతన పిల్లల శస్త్రచికిత్సలు: జీర్ణకోశ లోపాలు నుంచి క్లిష్ట నిర్మాణ లోపాల వరకు, పుట్టిన వెంటనే ప్రాణాలను కాపాడే శస్త్రచికిత్సలు 24/7 అందుబాటులో ఉన్నాయి.
లెవల్–IV ఎన్‌ఐసీయూ: హై-ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్, నైట్రిక్ ఆక్సైడ్ థెరపీ, టోటల్ పేరెంటరల్ న్యూట్రిషన్ వంటి అత్యాధునిక మద్దతుతో తీవ్ర అస్వస్థతలో ఉన్న నూతన శిశువులకు సంరక్షణ.
ఫీటల్ మెడిసిన్ & జన్యు కౌన్సెలింగ్: గర్భధారణ దశలోనే లోపాలను గుర్తించి, బహుశాఖ బృందంతో కలిసి ప్రసవం మరియు పుట్టిన వెంటనే చికిత్సను ఖచ్చితంగా ప్రణాళిక చేయడం.
అందరి బాధ్యత
ఈ నెలలో గర్భిణీ మహిళలకు సరైన సమాచారం, సంరక్షణ అందించేందుకు మనమంతా కలిసి ముందుకు రావాలి. నివారణే తొలి అడుగు. అయితే ప్రత్యేక అవసరాలతో పుట్టిన శిశువులకు ఆధునిక వైద్యచికిత్సలు ఒక క్లిష్ట నిర్ధారణను జీవన పోరాటం, విజయగాథగా మార్చగలవు.
కిమ్స్ కడల్స్ తో ప్రతి చిన్నారి ప్రయాణంలో భాగస్వాములమవడం మాకు గర్వకారణం, ప్రతి బిడ్డకు ఆరోగ్యకరమైన జీవితానికి ఉత్తమ అవకాశాన్ని కల్పించడమే మా సంకల్పం.
