కదనవోలు కర్నూలు

 

కర్నూలు జిల్లా ఉల్లిందకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2007- 2007 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. అప్పటి మిత్రులంతా నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ అందరూ ఆనందంగా గడిపారు.2006 – 2007 పదవ తరగతి బ్యాచ్‌కి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా మిత్రులంతా అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆటపాటలతో సరదాగా గడిపారు. అప్పుడు తమకు చదువుచెప్పిన టీచర్స్‌ను సన్మానించారు.వీరందరూ ఇదే స్కూల్లో చదువుకొని పదవ తరగతి పూర్తి అయిన తర్వాత.. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లి సెటిల్ అయ్యారు.అందరూ కలుసుకొని మొదటిసారిగా గెట్ టుగెదర్ ప్రోగ్రాం పెట్టుకున్నారు.1962 లో ఉల్లిండకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్థాపించి నేటికి స్కూల్ ఎంట్రెన్స్ ఆర్చ్ గేట్ లేకపోవడంతో పూర్వ విద్యార్థుల నూతన ఆర్చ్ ఎంట్రెన్స్ నిర్మాణం పూర్తి చేసి తమ గురువుల ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు.2006- 07 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఎప్పటికీ గుర్తుండేలాగా ఎంట్రెన్స్ నిర్మాణం తో గ్రామస్థులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.2006-07 బ్యాచ్ స్కూలు చరిత్రలో అత్యధికంగా విద్యార్థులు ఉన్న బ్యాచ్ గా ప్రత్యేకత కలదు.తమకు విద్యాబోధన చేసిన గురువులకు సన్మానం చేసి వారికి జ్ఞాపికలను అందజేశారు. అంతేకాకుండా చిన్ననాటి నుంచి తమతో పాటు చదువుకుని ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక్క స్నేహితురాలి కుటుంబానికి 20,000 ఆర్థిక సాయం చేశారు.గురువులు మాట్లాడుతూ.. ఆత్మీయ స‌మ్మేళ‌నం ఏర్పాటు చేయ‌డంతో పాటు త‌మ‌ను ఆహ్వానించినందుకు పూర్వ‌విద్యార్థులంద‌రికీ అభినంద‌న‌లు తెలిపారు. మీరంతా మీ వృత్తులు, రంగాల్లో మ‌రింత ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించాల‌ని ఆకాంక్షించి ఆశీర్వ‌దించారు. నాటి ప్ర‌ధానోపాధ్యాయుడు విజయకుమారి మాట్లాడుతూ.. మీరు ఎక్క‌డుత‌న్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ ఉద్యోగాల్లో ఉన్నా త‌ల్లిదండ్రుల‌ను బాగా చూసుకోవాల‌ని సూచించారు. త‌ల్లిదండ్రుల‌ను మంచిగా చూసుకోక‌పోతే ఎంత ఎత్తుకు ఎదిగినా వృధా అని అన్నారు. నీతి నిజాయితీని న‌మ్ముకుని బ‌త‌కాల‌న్నారు. క‌న్న‌వాళ్లు కంట‌త‌డి పెట్టే ప‌రిస్థితిని తీసుకురావొద్ద‌న్నారు. వీలైతే ఈ బ్యాచ్ విద్యార్థులంతా క‌లిసి ఒక ట్ర‌స్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థుల చ‌దువుల‌కు తోడ్పాటును అందించాల‌ని కోరారు. మీ అంద‌ర్నీ చూస్తుంటే గ‌ర్వంగా ఉంద‌ని, విద్యార్థులు ఉన్న‌త స్థానాల‌ను అధిరోహిస్తే సంతోషప‌డేది మొద‌ట గురువులే అని పేర్కొన్నారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌లో మన స్కూల్ నంబ‌ర్ వ‌న్ అని కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో చిన్నారులు ప్ర‌ద‌ర్శించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు అంద‌ర్నీ అల‌రించాయి.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్మాస్టర్ విజయకుమారి, ద్వారకానాథ్ శాస్త్రి, పిచెం రాజు,మధుసూదన శర్మ,సర్వేశ్వరరావు,జ్ఞానప్రసన్న, ఇందిరమ్మ, సులోచన, శ్యామలమ్మ,ప్రసాద్,వెంకటేశ్వర్లు,స్వర్ణలతమ్మ, లీలావతి ఉపాద్యాయులు జర్నలిస్ట్ శ్రీరామ్,168 మంది పూర్వ విద్యార్థుల పాల్గొన్నారు.

You missed