కందనవోలు కర్నూలు

సంస్కృతీ సంప్రదాయ పరిరక్షణలో భాగంగా దేవస్థానం వేకువజామున “భోగిమంటలు” కార్యక్రమాన్ని నిర్వహించింది.
ప్రధాన ఆలయ మహాద్వారం ఎదురుగా గంగాధర మండపం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
కార్యక్రమములో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఎ.వి. రమణ, ప్రత్యేక ఆహ్వానితులు ఎ. శ్రీనివాసులు, శ్రీస్వామివారి ప్రధానార్చకులు హెచ్. వీరయ్యస్వామి, పలువురు అర్చకస్వాములు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఈనాటి కార్యక్రమంలో ముందుగా అర్చకస్వాములు, వేదపండితులు లోకకల్యాణాన్నికాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు.
అనంతరం సంప్రదాయబద్దంగా పిడకలు, ఎండుగడ్డి, వంటచెరుకుని వేసి “భోగిమంటలు” వేయబడ్డాయి.
సంక్రాంతి సందర్భంగా వేసే భోగిమంటలకు మన సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. ఈ భోగిమంటలు వేయడం వలన దుష్టపీడలు విరగడై, అమంగళాలు తొలగి సకలశుభాలు కలుగుతాయని చెప్పబడుతోంది.
ముఖ్యంగా మన సంస్కృతి సంప్రదాయాలపై అందరికీ మరింత అవగాహన కల్పించాలనే భావనతో ఏటా దేవస్థానం ఈ భోగిమంటల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
