కందనవోలు శ్రీశైలం

మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు నిర్వహింపబడే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మూడవనాడైన శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి.
ఉత్సవాలలో భాగంగానే యాగశాల యందు శ్రీచండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపించబడ్డాయి. అనంతరం లోకకల్యాణంకోసం జపాలు, పారాయణలు చేయడం జరిగింది.
తరువాత మండపారాధనలు, పంచావరణార్చనలు, రుద్రహోమం కార్యక్రమాలను ఆగమశాస్త్రం ప్రకారంగా జరిపించబడ్డాయి.
అదే విధంగా ఈ సాయంకాలం ప్రదోషకాలపూజలను, హోమాలను జరిపించిన తరువాత జపానుష్టానాలు జరిపించబడతాయి.
కైలాసవాహన సేవ
ఈ బ్రహ్మోత్సవాలలో నిర్వహించబడే వాహనసేవలలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్లకు కైలాసవాహనసేవ జరిపించబడుతుంది.
ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకారమండపంలో కైలాసవాహనంపై వేంచేపు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించబడతాయి.
తరువాత పురవీధులలో గ్రామోత్సవం జరిపించబడుతుంది. గ్రామోత్సవములో జానపద కళారూపాల ప్రదర్శన, కోలాటం తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేయబడింది.నేడు కార్యక్రమాలు ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, చండీశ్వర పూజ, మండపారాధనలు, పంచావరణార్చనలు, జపానుష్టానాలు, రుద్రహోమం, సాయంకాలం నిత్య హవనాలు, బలిహరణలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించబడతాయి.ఈ ఉత్సవాలలో భాగంగా నేడు సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్లకు నందివాహనసేవ జరిపించ బడుతుంది.
ముగ్గుల పోటీలు
సంక్రాంతి సందర్భముగా మహిళలకు ముగ్గులపోటీలు కూడా నిర్వహించబడుతున్నాయి. ప్రధానాలయగోపురం ఎదురుగా గంగాధర మండపం వద్ద ఈ పోటీలు నిర్వహించబడుతాయి.
