కందనవోలు కర్నూలు
ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని, మదాసి కురువ, మదారి కురువ ఎస్సీ హక్కుల పోరాట సమితి కర్నూలు జిల్లా జాయింట్ సెక్రటరీ (సంయుక్త కార్యదర్శి) కురువ వీరేష్.. పెంచికలపాడులోని విశ్వభారతి జనరల్ ఆసుపత్రిలో రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “అమ్మ జన్మనిస్తే.. రక్తదాత పునర్జన్మనిస్తాడు” అని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న ప్రాణాలను కాపాడేందుకు యువత ఈ స్ఫూర్తితో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 18 నుంచి 50 ఏళ్ల వయసు ఉండి, 50 కిలోల కంటే ఎక్కువ బరువున్న స్త్రీ, పురుషులు ఎవరైనా రక్తదానం చేయడానికి అర్హులని ఆయన తెలిపారు. ప్రతి ఆరు నెలలకోసారి రక్తదానం చేయడం వల్ల శరీరంలో ఎప్పటికప్పుడు కొత్త రక్తం ఉత్పత్తి అవుతుందని, రక్తదానం చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలు కాపాడటమే కాకుండా దాతలకు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ నాయకులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
