కందనవోలు కర్నూలు
కర్నూల్ నగరం స్థానిక నంద్యాల చెక్ పోస్ట్ నందు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఫోర్ వీలర్ వాహనాలను త్రీ టౌన్ ఎస్సై ఏపీ శ్రీనివాసులు తనిఖీ చేశారు. బక్రీద్ పండగ సందర్భంగా గోవులను తరలించకుండా వాహనాలను తనిఖీ చేసినట్లు ఎస్సై తెలిపారు. గోవులను ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా రక్షించాలన్నారు. ఈ తనిఖీలలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
