కందనవోలు కల్లూరు

కల్లూరు మండలం సల్కాపురం గ్రామంలో శ్రీ గణపతి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి గరుడ ధ్వజ, హనుమత ధ్వజ ప్రతిష్ట పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది.
ఈ కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్, నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కమ్మరి పార్వతమ్మ హాజరై స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు.
గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తి శ్రద్ధల మధ్య వేద మంత్రోచ్చారణలతో పూజలు నిర్వహించగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

You missed