కందనవోలు కర్నూలు
కర్నూలు జిల్లా ప్రజలు పెట్రోల్, డీజిల్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా చెప్పారు. జర్మనీ పర్యటనలో ఉన్న మంత్రి ఈ విషయంపై జిల్లా అధికారులతో మాట్లాడి ఒక ప్రకటన విడుదల చేశారు.జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఎంత మాత్రం లేదు. ప్రజలు అనవసరంగా భయాందోళనకు గురికావద్దు. అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ ను కొనుగోలు చేయకండి. ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి, పెట్రోల్ అందుబాటులో లేదు అని ప్రజలను భయపెట్టి బ్లాక్ మార్కెట్లో అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పెట్రోల్, డీజిల్ నిల్వలపై అధికారులు ఎప్పటికప్పుడు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు భయపడవద్దని నేను కోరుతున్నాను.
