కందనవోలు కర్నూలు

వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా కర్నూలులోని మెడికవర్ హాస్పిటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ విశ్వక్ కుమార్ బ్రెయిన్ ట్యూమర్‌పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రెయిన్ ట్యూమర్‌పై ప్రజల్లో అవగాహన పెంచడం, రోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు మద్దతు ఇవ్వడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. బ్రెయిన్ ట్యూమర్ కారణాలు, లక్షణాలు, చికిత్స విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.
బ్రెయిన్ ట్యూమర్ వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అసాధారణ తలనొప్పి, వాంతులు, ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
బ్రెయిన్ ట్యూమర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందితే తక్కువ ఖర్చుతో పాటు ప్రాణాపాయం నుంచి కూడా బయటపడవచ్చని డాక్టర్ విశ్వక్ కుమార్ పేర్కొన్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో బ్రెయిన్ ట్యూమర్‌కు అత్యాధునిక చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ హెడ్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.