కందనవోలు కర్నూలు

వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో జరిగిన కల్తీ వ్యవహారంపై సిట్ నివేదిక ద్వారా వైకాపా నాయకులు చేసిన భారీ కుంభకోణం బట్టబయలైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కల్తీ నెయ్యి వ్యవహారానికి నిరసనగా కల్లూరు అర్బన్ 27వ వార్డు కృష్ణ నగర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యాపురం ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాణ్యం నియోజకవర్గం యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక భక్తులు, కూటమి పార్టీ నాయకులు, ఆలయ పూజారులతో కలిసి ఈ పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
అలాగే ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ కమ్మరి పార్వతమ్మ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
