కందనవోలు కర్నూలు
ఎస్టీబీసీ గ్రౌండ్లో మే 1 నుంచి 31 వరకు నిర్వహించిన హాకీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఈరోజు ఘనంగా ముగిసింది. హాకీ కోచ్ కే రాము ఆధ్వర్యంలో శిక్షణ పొందిన క్రీడాకారులకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమానికి *ముఖ్య అతిథిలు న్యూ కర్నూలు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు తిరుపాల్ రెడ్డి కర్నూలు వన్‌టౌన్ సీఐ మారుతి శంకర్ టీడీపీ తెలుగు యువత నగర అధ్యక్షులు ఎస్. ఆనంద్ బాబు , రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ రైజింగ్ స్టార్ హాకీ క్లబ్ ఫౌండర్ అరుణ్ రవి రైజింగ్ స్టార్ హాకీ క్లబ్ చైర్మన్ సుంకన్న , రైసింగ్ స్టార్ హాకీ క్లబ్ అధ్యక్షులు ఎం. భరత్ కుమార్ ట్రెజరర్ మురళి మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రకాష్ పాల్గొని క్రీడాకారులను అభినందించారు. లోద్దిపల్లె, మీది వేముల, గూడూరు, మునగలపాడు పంచలింగాల మరియు కర్నూలు ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు ఈ క్యాంపులో పాల్గొని శిక్షణ పొందారు. అతిథులు క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
