కందనవోలు కర్నూలు

నూతనంగా ఎన్నికైన రాష్ట్ర యువజన సంఘం నాయకుడిని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రాలయం కురువ నాయకులు మాజీ సర్పంచ్ రామాంజనేయులు అలాగే వారి బృందం.
మంత్రాలయం పరిధిలో ఐరనగల్లు గ్రామంలో కనకదాసు విగ్రహ ప్రతిష్ఠ మరియు గుడి నిర్మాణం కొరకు తనవంతు సహాయం చేసారు,కనకదాసులు వారు మా కులం ఆరాధ్య దైవం ఆయన ఒక ప్రముఖ భక్తుడు, కవి, తత్వవేత్త మరియు సంగీత స్వరకర్త. భక్తి తత్వంతో పాటు కులమత భేదాలను వ్యతిరేకిస్తూ సంఘ సంస్కర్తగా గుర్తింపు పొందారు. సాహిత్యం: కన్నడ భాషలో ఎన్నో భక్తి కీర్తనలు, ఉగాభోగాలు రచించారు.ఉడిపి కృష్ణుడు: ఉడిపి శ్రీకృష్ణ మఠంలో స్వామివారు కనకదాసు కోసం వెనక్కి తిరిగి దర్శనం ఇచ్చారనే ప్రసిద్ధ కథ ఉంది (దీనినే ‘కనకన కిండి’ లేదా కనకదాసు కిటికీ అంటారు).ఇలాంటి మహనీయులు మా కులం లో జన్మించడం మా కులం యొక్క పూర్వజన్మ సుకృత అని కొనియాడారు. అలాగే ఇలాంటి కనకదాసుల వారి విగ్రహ ప్రతిష్ఠ గుడి నిర్మాణం కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలలోనైనా మొదలుపెట్టిన కురువ సోదరలందురు రాష్ట్రంలో తమవంతు సహాయం సహకారం చేయాలని,అలాగే రాష్ట్రంలో కురువలంతా ఐక్యంగా ఉండి కుల ఐక్యత కు అభివృద్ధి కి ఐక్యతతో కృషి చేయాలని కోరిన యువజన సంఘము రాష్ట్ర అధ్యకులు కురువ శివరాం.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ సంఘం సహాయ కార్యదర్శి బి ఎన్ టాకీస్ వెంకటేష్,కురువ మల్లికార్జున్, బావిగడ్డ రంగయ్య,కురువ సంఘం నాయకులు పాల్గొన్నారు
