కందనవోలు హైదరాబాద్, నవంబర్ 12,
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ప్రతియేటా నవంబర్ 19న నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ & యూరాలజీ (ఏఐఎన్‌యూ), బంజారాహిల్స్ శాఖలో పురుషుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ.. పురుషుల సమగ్ర వెల్‌నెస్ ప్రోగ్రాంను ప్రారంభించింది. ఇందులో భాగంగా పురుషుల్లో పెరుగుతున్న వంధ్యత్వం (సంతానరాహిత్యం), లైంగిక పటుత్వం లోపించడం లాంటి సమస్యలపై ప్రధానంగా దృష్టిసారించారు. పురుషులు తరచుగా నిర్లక్ష్యం చేసే ఆరోగ్యపరమైన అంశం విషయంలో వారికి ప్రాధాన్యం ఇవ్వడం, అవసరమైన సమయంలో వైద్యసహాయం పొందే ధైర్యాన్ని వారిలో పెంపొందిచి, సరైన సమయానికి వాటిని పరిష్కరించుకునేలా చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ప్రత్యేకంగా పురుషులు తమ ఆరోగ్య సమస్యలను త్వరగా గుర్తించి చికిత్స పొందాలని, ఈ అంశాలపై ఉన్న నిశ్శబ్దాన్ని, అపోహలను అధిగమించాలని ఏఐఎన్‌యూ వైద్యులు ప్రోత్సహిస్తున్నారు. వీటి గురించి బహిరంగంగా మాట్లాడడం, అపోహలను తొలగించుకోవడం, ఈ సమస్యలు మరింత ముదిరేవరకు వేచిచూడకుండా సరైన సమయానికి తగిన వైద్య సలహాలు పొందే విషయంలో పురుషులకు తగిన మద్దతు లభించేలా చూడడం దీని లక్ష్యం.హైదరాబాద్‌లో పురుషుల వంధ్యత్వం పెరుగుతోంది. ప్రస్తుతం పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ లైంగిక, జనన సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. మొత్తం వంధ్యత్వం కేసులలో 30% నుంచి 50% వరకు పురుషుల కారణాలే ఉంటున్నాయి. ఇవి కేవలం వారివల్ల కావచ్చు, లేదా మహిళల వల్ల ఉండే కారణాలతో కలిపి కావచ్చు. గత కొన్నేళ్లలో తెలంగాణలో వంధ్యత్వం కేసులు 15-20% పెరిగాయి. దీనికి ప్రధాన కారణాలు.. ఒత్తిడితో కూడిన జీవన విధానం, నిద్రలేమి, ఊబకాయం, పర్యావరణ ప్రభావాలు, వీర్య నాణ్యత తగ్గడం.పురుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యేక ప్యాకేజిలో ఆండ్రాలజిస్టు పరీక్షలతో పాటు హార్మోన్ ప్రొఫైలింగ్, ప్రోస్టేట్ స్క్రీనింగ్, జీవనశైలి అంచనా, వీర్యపరీక్ష ఉంటాయి. ఏవైనా సమస్యలుంటే త్వరగా గుర్తించి, పునరుత్పాదక, లైంగిక ఆరోగ్య సమస్యలను నయం చేసుకోవడం దీని లక్ష్యం. స్క్రీనింగ్ ప్రోగ్రాంలో ఆండ్రాలజిస్టు కన్సల్టేషన్, టెస్టోస్టిరాన్, మధుమేహం స్థాయి, మెటబాలిక్ ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడానికి కొన్ని రక్తపరీక్షలు చేస్తారు. వీటన్నింటికీ లైంగిక, సంతానోత్పత్తి ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. అవి.. హెచ్‌బీఏ1సీ, లిపిడ్ ప్రొఫైల్, టీఎస్‌హెచ్. వీటితో పాటు స్క్రోటల్ అల్ట్రాసౌండ్, సెమన్ ఎనాలిసిస్ పరీక్షలు కూడా చేస్తారు.ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్‌లోని పురుషులు తమ పునరుత్పాదక, లైంగిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చేలా ప్రోత్సహిస్తారు. ముందుగా పరీక్షలు చేయించుకుని, సమయానికి చికిత్స పొందేలా చూస్తారు. పురుషుల ఫెర్టిలిటీ, టెస్టోస్టిరాన్ తగ్గుదల, లైంగిక ఆరోగ్య సమస్యల్లాంటి వాటికి చికిత్సల కోసమే ఈ ప్రోగ్రాం రూపొందించారు.ఈ సందర్భంగా ఏఐఎన్‌యూ బంజారాహిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ పూర్ణచంద్రారెడ్డి మాట్లాడుతూ “మానసిక ఒత్తిడి, సిగ్గు, సమయం లేమి వంటి కారణాల వల్ల పురుషులు తమ వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తారు. ఈ వెల్‌నెస్ ప్రోగ్రాం ద్వారా, ముందస్తు చికిత్సల గురించి అవగాహన పెంచి, పురుషులు తమ సమగ్ర ఆరోగ్యం, పునరుత్పాదక ఆరోగ్యంపై తగిన చర్యలు తీసుకోవాలన్నదే ఏఐఎన్‌యూ లక్ష్యం” అని చెప్పారు.కన్సల్టెంట్ యూరాలజిస్ట్ & ఆండ్రాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ సూరజ్ పిన్ని మాట్లాడుతూ,“సమస్యలు ఎక్కువయ్యేవరకు పురుషుల ఆరోగ్యాన్ని తరచు నిర్లక్ష్యం చేస్తారు. ఈ వెల్‌నెస్ ప్యాకేజీ ద్వారా ఫెర్టిలిటీ, లైంగిక ఆరోగ్య సమస్యలను పురుషులు ఆత్మవిశ్వాసంతో, శాస్త్రీయ మార్గంలో ముందుగానే గుర్తించేలా మేం ప్రోత్సహిస్తున్నాం. సకాలంలో పరీక్షలు, జీవనశైలిలో మార్పులు చేస్తే వారి సమగ్ర ఆరోగ్యంపై మంచి ప్రభావం ఉంటుంది” అని తెలిపారు.ఏఐఎన్‌యూ సెంటర్ ఫర్ మెన్స్ హెల్త్ అండ్ ఆండ్రాలజీలో.. పురుషుల లైంగిక ఆరోగ్య సమస్యలు, వంధ్యత్వానికి ప్రత్యేక వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా అంగస్తంభన సమస్యకు ప్రత్యేక చికిత్సలు లభిస్తాయి. ఇవి కూడా ప్రతి ఒక్క వ్యక్తికీ ప్రత్యేకంగా రూపొందించడంతో పాటు వారికి పూర్తి గోప్యతతో చికిత్సలు అందిస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా ఆండ్రాలజిస్టుల బృందం, పురుషుల లైంగిక సమస్యలకు అత్యాధునిక చికిత్సలు ఉన్నాయి. వీటిలో లో ఇంటెన్సిటీ ఎక్స్‌ట్రాకార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ, ఇంట్రా కేవెర్నోసాల్ ఇంజెక్షన్లు, వంధ్యత్వంలో వేరికోసెల్ శస్త్రచికిత్సకు ఇంట్రా ఆపరేటివ్ డాప్లర్ గైడెన్స్ ఉన్నాయి. అలాగే ప్రోస్టేట్ సమస్యలున్న పురుషులకు స్ఖలనాన్ని కాపాడేందుకు వాటర్ వేపర్ థెరపీ, ప్రోస్టేటిక్ యురేథ్రల్ లిఫ్ట్ లాంటి ఆధునిక సాంకేతిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ గురించిఏ షియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) అనేది యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన, దేశంలోని ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నెట్ వర్క్ అయిన ఏషియా హెల్త్‌కేర్ హోల్డింగ్స్‌లో భాగం. నాలుగు నగరాల్లో ఏడు అత్యాధుని ఆస్పత్రులతో ఏఐఎన్‌యూ అంతర్జాతీయ స్థాయి కిడ్నీ, యూరాలజీ చికిత్సలు అందించడంలో ముందంజలో ఉంది. ఏఐఎన్‌యూలో అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అవి.. యూరాలజీ రోబోటిక్ సర్జరీ, యూరో-ఆంకాలజీ, రీకన్‌స్ట్రక్టివ్ యూరాలజీ, నెఫ్రాలజీ, కిడ్నీ మార్పిడి, డయాలసిస్, మహిళల యూరాలజీ, పీడియాట్రిక్ యూరాలజీ, పురుషుల ఆరోగ్యం, ఆండ్రాలజీ. భారతదేశంలో యూరలాజికల్ శస్త్రచికిత్సలలో అగ్రగామి అయిన ఏఐఎన్‌యూ ఇప్పటివరకు 5 లక్షల మందికి పైగా రోగులకు చికిత్సలు అందించి, 1400కు పైగా రోబోటిక్ శస్త్రచికిత్సలు చేసింది. ఈ ఆస్పత్రిలో 500కు పైగా పడకలున్నాయి. ఎన్ఏబీహెచ్ అక్రెడిటేషన్‌తో పాటు డీఎన్‌బీ, ఎఫ్ఎన్‌బీ లాంటి పీజీ శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడానికి కూడా గుర్తింపు పొందింది. ప్రత్యేక చికిత్సలు, ఆవిష్కరణల విషయంలో ఏఐఎన్‌యూ ఎప్పుడూ ప్రమాణాలను పునర్నిర్వచిస్తోంది.
