కందనవోలు ముంబై, నవంబర్ 13

లగ్జరీ మరియు అపర్-అప్స్కేల్ హోటళ్ల యజమానిగా ఉన్న అడ్వెంట్ హోటల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. సంస్థ తన ఈక్విటీ షేర్లను నవంబర్ 13, 2025న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మరియు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టింగ్ అయినట్లు ప్రకంటించింది. ఈ లిస్టింగ్ సంస్థ అభివృద్ధి పయనంలో కీలకమైన మైలురాయిగా నిలుస్తోంది.వాలర్ ఎస్టేట్ లిమిటెడ్. (మునుపటి డిబి రియాల్టీ లిమిటెడ్) నుండి విడిపోయిన ఈ సంస్థ, భారతదేశంలో ఉన్న ప్రముఖ మైక్రో-మార్కెట్లలో హోటల్ ఆస్తులను అభివృద్ధి చేసి నిర్వహిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి గోవాలో గ్రాండ్ హయత్ (313 కీస్‌ + 113 అభివృద్ధిలో) మరియు ముంబైలో హిల్టన్ (171 కీస్‌) హోటళ్లు ఉన్నాయి.ప్రొమోటర్ డైరెక్టర్ అర్షద్ బల్వా మాట్లాడుతూ,* “ఈ లిస్టింగ్ అడ్వెంట్ హోటల్స్‌ను పారదర్శకమైన, మూలధన సామర్థ్యంతో కూడిన హాస్పిటాలిటీ ప్లాట్‌ఫారమ్‌గా నిలబెడుతుంది. మా లక్ష్యం దీర్ఘకాలిక షేర్‌హోల్డర్ విలువ సృష్టి,” అని అన్నారు.’సీఈఓ రాహుల్ పండిట్ మాట్లాడుతూ,* “భారత లగ్జరీ హాస్పిటాలిటీ రంగంలో వచ్చే వృద్ధి తరంగాన్ని అందుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం,” అని తెలిపారు.కంపెనీ దిల్లీ ఏరోసిటీలో సెయింట్ రెజిస్ మరియు మారియట్ మార్క్విస్, అలాగే ముంబైలో వాల్డోర్ఫ్ ఆస్టోరియా, హిల్టన్ (వోర్లీ) మరియు బికెసీలో 1,175 కీస్‌ హోటల్ వంటి ఐదు ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది.ఈ ప్రాజెక్టులు పూర్తికాగానే, కంపెనీ 3,100 కీస్‌ సామర్థ్యాన్ని చేరుకోగా, ఏబిటా ₹1,200 కోట్లకు పైగా ఉండనుంది.అదనంగా, ముంబై అంధేరీ ఈస్ట్‌లోని సహార్ ప్రాంతంలో (~5.4 ఎకరాలు) ₹4,500 కోట్ల విలువైన హాస్పిటాలిటీ ప్రాజెక్ట్ ను ​​ప్రెస్టీజ్ గ్రూప్‌తో 50:50 జాయింట్ వెంచర్‌ ద్వారా అభివృద్ధి చేయనుంది.

You missed