కందనవోలు శ్రీశైలం
అర్ధరాత్రి వరకు భక్తుల సందోహంతో దేవస్థానం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చకుల వేదఘోషల మధ్య నైవేద్యాలు నిర్వహించగా, ఆలయ ప్రాంగణం మొత్తం దీపాల వెలుగులతో చుక్కలు పడుతున్నట్లుగా కళకళలాడింది.జరిపించబడ్డాయి
ఈ కార్యక్రమములో దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీపోతుగుంట రమేష్నాయుడు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు మరియు పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.ప్రాతఃకాలం నుంచే వేలాది సంఖ్యలో భక్తులు క్షీరసాగర తీర్థం, పాతాళ గంగ, గంగాధరాళ్ల చుట్టుపక్కల ప్రాంతాలకు చేరుకుని దీపాలు వెలిగించారు. సాయంత్రం ప్రధాన కార్యక్రమంగా కోటి దీపాలు వెలిగించడంతో శ్రీశైలం పర్వత ప్రాంతమంతా వెలుగుల హోళిగా మారింది. ప్రత్యేకంగా దేవస్థానం అధికారులు ఏర్పాటు చేసిన అలంకరణలు, విద్యుత్ దీపాలతో ఆలయ ప్రాంతం మరింత అందంగా మెరిసింది.వేడుకలను పురస్కరించుకుని యాత్రికుల కోసం అన్నప్రసాదాలు, వైద్య సహాయం, తాగునీటి సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు అధికారులు విస్తృతంగా చేపట్టారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని దేవస్థాన అధికారులు తెలిపారు.కోటి దీపోత్సవం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం భారీగా భక్తులు చేరడంతో శ్రీశైల క్షేత్రం మరోసారి ఆధ్యాత్మికోత్సవాలకు కేంద్రబిందువైంది.
