కందనవోలు నంద్యాల
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ నేడు గోస్పాడు, రేవనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి చట్టపరిధిలో వారి సమస్యలను పరిష్కరించాలన్నారు.గ్రేవ్ మరియు పెండింగ్ కేసుల పరిశీలించి పెండింగ్ గల కారణాలపై ఆరా తీశారు. కేసుల దర్యాప్తు వేగవంతానికి పలు సూచనలను జారీ చేయడం జరిగింది.ప్రాపర్టీ కేసులలో రికవరీ శాతం పెంచాలని ఆదేశించారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో ఎలాంటి గొడవలు అల్లర్లు జరగకుండా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు సమస్యాత్మక గ్రామాలపై నిఘా ఉంచాలన్నారు. జిల్లావ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రతిరోజు పోలీస్ అధికారులు నిర్వహిస్తున్న విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో స్వయంగా ఎస్పీ గారు పాల్గొని రేవనూరు పోలీస్ స్టేషన్ నందు వాహనాలను తనిఖీ చేయడం జరిగింది. మద్యం సేవించి వాహనాలు నడపరాదని ప్రజలకు తెలియజేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తున్న పనితీరును స్వయంగా పర్యవేక్షించడం జరిగింది. 112 టోల్ ఫ్రీ నంబర్ కు ఉపయోగించే ట్యాబ్ లను వాటి పనితీరును పరిశీలించి పలు సూచనలు చేయడం జరిగింది.
