కందనవోలు కర్నూలు
జోహరపురం గ్రామంలో మలేరియా నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మలేరియా శాఖ అధికారి నూకల రాజు ఆధ్వర్యంలో, ఉరుగంటపల్లి ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ మౌనిక, ల్యాబ్ టెక్నీషియన్ మురళి, ఏఎన్ఎం అనురాధ, ఆరోగ్య కార్యదర్శి విద్యానంద సాగర్, ఆశా వర్కర్ ఘౌసియా పాల్గొన్నారు.
గ్రామ ప్రజల్లో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. మకుట్ల పెంపకం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోాలని సూచించారు. రోగుల నుంచి రక్త నమూనాలు సేకరించి మలేరియా పరీక్షలు నిర్వహించారు. గ్రామంలో శుభ్రత, నిల్వ నీటి తొలగింపు వంటి చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు.
