కందనవోలు నంద్యాల
నంద్యాల జిల్లా పాణ్యం మండలం కౌలూరు గ్రామానికి చెందిన బైరెడ్డి వర్గం, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ తాలూకా అధ్యక్షులు, నల్లల మునిశేషి రెడ్డి( 96) ఆదివారం వయోభారంతో మృతి చెందారు. మునిశేషిరెడ్డి మరణవార్త తెలిసిన వెంటనే టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి కౌలూరు గ్రామంకు చేరుకొని మునిశేషిరెడ్డి పార్థివ దేహానికి ఘనంగా నివాళ్లు అర్పించిన, ఆయన కుటుంబ సభ్యులను బైరెడ్డి రాజశేఖరరెడ్డి పరమార్శించి సంతాపం తెలిపి, సానుభూతి ప్రకటించారు. ఈ సందర్బంగా బైరెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో మొదటి తరం రాజకీయ నాయకులుగా, విలువలతో కూడిన రాజకీయాలు చేసి, ఆనాటి తాలూకా అధ్యక్షులుగా మునిశేషిరెడ్డి పనిచేశారని ఆయన సేవలు కొనియాడారు.
