కందనవోలు తిరుపతి

జిల్లాకు చెందిన 1,54,908 రైతు కుటుంబాలకు రూ.7,000 చొప్పున రూ.104.15 కోట్ల నగదు జమ చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ రెండు విడతలు కలిపి జిల్లాలో రూ.211 కోట్లు జమరైతులకు అవసరమైన మేర యూరియా విడతల వారీగా అందిస్తాం . . రైతులు ఆందోళన చెందవద్దు పంట రుణాల కింద ఖరీఫ్ సీజన్ లో రూ.6,300 కోట్లు ఇచ్చాం. . రాబోయే రబీ సీజన్ కు రూ.4,360 కోట్లు అందిస్తున్నాం పడుగ వాతావరణంలో జిల్లాలో అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ 2వ విడత కార్యక్రమంలో 1,54,908 రైతు కుటుంబాలకు రూ.7,000 చొప్పున రూ.104.15 కోట్ల నగదు రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.బుధవారం నాయుడుపేటలోని శ్రీనివాసా కళ్యాణ మండపంలో అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ 2వ విడత నగదు జమ చేసే కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తో కలసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు *అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్* కార్యక్రమం ద్వారా రూ.20 వేల ఆర్థిక సహాయం ను రైతుల ఖాతాలకు మూడు విడతల్లో జమ చేసే కార్యక్రమం చేపట్టిందని, ఇందులో భాగంగా మొదటి విడతగా ఖరీఫ్ సీజన్ లో రూ.7,000 లను ఆగష్టు 2025న జమ చేసిందని తెలిపారు. జిల్లాలో 2వ విడతగా 1,54,908 రైతు కుటుంబాలకు రూ.7,000 చొప్పున రూ.104.15 కోట్ల నగదు రైతుల ఖాతాలకు జమ చేస్తున్నదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా, కమలాపురం నియోజకవర్గం నుండి లాంఛనంగా ప్రారంభించారన్నారు. అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ కింద రెండు విడతలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన రైతుల ఖాతాలకు రూ.14 వేలు జమ చేస్తున్నదని, జిల్లాలో రెండు విడతలు కలిపి రూ.211 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేశామన్నారు. మూడవ విడతగా మిగిలిన రూ.6 వేల ను సంక్రాంతి తరువాత జమ చేయడం జరుగుతుందన్నారు. నగదు జమ కాని వారు ఆందోళన చెందనవసరం లేదని, బ్యాంక్ ఖాతాలు, భూ యజమాని పేరు మార్పు సమస్యల కారణంగా నగదు జమ కాకపోయి ఉండవచ్చునని, లబ్ధిదారులు వీటిని సరిచూసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నా రైతుల సంక్షేమమే ధ్యేయంగా అన్నదాతలకు రూ.20 వేలు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నదన్నారు. రైతుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చిందని, ఇందులో భాగంగా జిల్లాలో ఎటువంటి సమస్య లేకుండా ప్రతి రైతుకు ఎకరాకు మూడు బస్తాల చొప్పున యూరియా అందిస్తున్నామన్నారు. జిల్లాలో 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ లక్ష్యానికి గానూ 12.5 వేల మెట్రిక్ టన్నులు పంపిణీ చేశామని, రైతు సేవా కేంద్రాలు, ప్రైవేట్ షాపులలో మిగిలిన 7.5 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి రైతుకు యూరియా సరఫరా చేసే భాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి రైతులకు పంపిణీ చేయడానికి అవసరమైన యూరియాను ప్రభుత్వం సరఫరా చేస్తున్నదన్నారు. భవిష్యత్తు అవసరాలకు ముందుగానే యూరియా సమీకరించుకోవాలన్న ఆలోచనతో యూరియా సరిపోదన్న ఆందోళన చెందనవసరం లేదన్నారు. నాట్లు వేసే సమయంలో, మొక్కలు నాటిన 30 రోజులకు, కోతకు సిద్ధం గా ఉన్న కొన్ని రోజుల ముందు ఇలా యూరియా సరఫరా చేస్తామన్నారు. మందుల పిచ్చికారీ చేయడానికి రోజు కూలీ సుమారు రూ.600 నుండి రూ.800 ఖర్చు అవుతుందని, దీని ద్వారా ఒక రోజు గరిష్టంగా 6 ఎకరాలకు మందులు పిచ్చికారీ చేసుకోగలరన్నారు. డ్రోన్ ల వినియోగం ద్వారా ఎకరాకు రూ.350 చెల్లిస్తే సరిపోతుందని, రోజుకు సుమారు 30 ఎకరాలకు మందులు పిచ్చికారీ చేయవచ్చునని, రైతు నేరుగా మందులు చల్లడం ఉండదు కావున వారిని ఆరోగ్యం కాపాడుకోగలుగుతారన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా తిరుపతి జిల్లాలో డ్రోన్ లను రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఎండాకాలంలో తగినంత పచ్చిరొట్టె పంపిణీ చేశాము, తద్వారా భూసారం పెరిగిందని, అవసరమైన ఎరువులను పంపిణీ చేశామన్నారు. గత రెండు సంవత్సరాల కాలంలో తగినంత వర్షపాతం నమోదైందని, జిల్లా వ్యాప్తంగా చెరువులు నీటితో కళకళడుతున్నాయని, కండలేరులో వచ్చే సంవత్సరానికి అవసరమైన నీరు ఉందని, రైతులు ఎవరూ కంగారూ పడవద్దన్నారు. కనీసం రెండు పంటలు వరి పండించుకోవచ్చునన్నారు. చెరువులు తెగకుండా చెరువుకట్టలకు అవసరమైన మరమత్తులు చేయడం జరిగిందన్నారు. ప్రత్యేకించి నాయుడుపేట నియోజకవర్గంలో చెరువులు తెగే పరిస్థితి లేదన్నారు. 750 మంది రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించామని, ఇంకా అవసరమైతే పనిముట్లు, యంత్ర పరికరాలు అందిస్తామన్నారు. పంట రుణాల కింద ఖరీఫ్ సీజన్ లో రూ.6,300 కోట్లు ఇప్పటికే ఇవ్వడం జరిగిందని, రాబోయే రబీ సీజన్ కు రూ.4,360 కోట్లు అందిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో సూళూరుపేట ఆర్డిఓ కిరణ్మయి, నాయుడుపేట అగ్రికల్చర్ కమిటీ చైర్మన్ ప్రవీణ్, సూళ్లూరుపేట అగ్రికల్చర్ కమిటీ చైర్మన్ రమేష్, బెస్త కార్పొరేషన్ చైర్మన్, చెల్లకూరు సొసైటీ చైర్మన్ కె.వి నాయుడు, అగ్రికల్చర్ జెడి ప్రసాదరావు, నాయుడుపేట అగ్రికల్చర్ ఏడి నాగార్జునసాగర్, డిపిఎం షణ్ముగం, సూళ్లూరుపేట, నాయుడుపేట అగ్రికల్చర్ అధికారులు వీఎవోలు,స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు

You missed